Home Telugu ఇంద్ర‌గంటి నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ మెంట్..!

ఇంద్ర‌గంటి నెక్ట్స్ మూవీ ఎనౌన్స్ మెంట్..!

10
0
indraganti next movie

గ్ర‌హ‌ణం, మాయాబ‌జార్, అష్టా చ‌మ్మా, గోల్కండ హైస్కూల్, అంత‌కు ముందు, ఆ త‌రువాత‌, బందిపోటు, జెంటిల్ మాన్, అమీ తుమీ, స‌మ్మోహ‌నం…ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఏర్ప‌రుచుకున్న డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌. స‌మ్మోహ‌నం సినిమా త‌ర్వాత ఇంద్ర‌గంటి నెక్ట్స్ మూవీ చేయ‌డానికి సంవ‌త్స‌రం టైమ్ తీసుకుంటాను అని చెప్పారు కానీ..చూస్తుంటే..త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్లేట్టు ఉంది.

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ అధినేత దిల్ రాజు ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ‌తో సినిమా చేయ‌నున్న‌ట్టు కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే ఈరోజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంస్థ ఇంద్ర‌గంటితో సినిమా చేస్తున్న‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసింది. మ‌ల్టీస్టార‌ర్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. త్వ‌ర‌లోనే పూర్తి వివరాల‌ను ఎనౌన్స్ చేస్తామ‌ని చెప్పారు. మ‌రి…ఈ మ‌ల్టీస్టార‌ర్ లో హీరోలుగా ఎవ‌రు న‌టిస్తారో చూడాలి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here