Home Telugu ఈనెల 14న న‌న్ను దోచుకుందువ‌టే టీజ‌ర్..!

ఈనెల 14న న‌న్ను దోచుకుందువ‌టే టీజ‌ర్..!

16
0
Nannudochukundavate teaser

స‌మ్మోహ‌నం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న సుధీర్ బాబు తాజా చిత్రం న‌న్ను దోచుకుందువ‌టే. సుధీర్ బాబు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ లో ఆర్.ఎస్.నాయుడుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ… సుధీర్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేసిన‌ప్ప‌టి నుంచి ఈ సినిమా పై అంచ‌నాలు పెరిగాయి. న‌భా న‌టేష్ ఈ చిత్రం ద్వారా హీరోయిన్ గా ప‌రిచ‌యం అవుతోంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఈ నేప‌ధ్యంలో ఈనెల 14న 10.02 నిమిషాల‌కు టీజ‌ర్ ని రిలీజ్ చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ…అంద‌రికీ న‌చ్చేలా విభిన్న క‌థాంశంతో ఈ సినిమాని తెర‌కెక్కించాను. క‌థ చాలా కొత్త‌గా ఉంటుంది. కొత్త హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ న‌భా న‌టేష్ చాలా బాగా న‌టించింది. అజ‌నీష్ సంగీతం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. సుధీర్ బాబు నిర్మాణ ప‌రంగా ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే మిగిలిన వివ‌రాల‌ను ఎనౌన్స్ చేస్తాం అన్నారు. ఈ మూవీ పోస్ట‌ర్స్ చూస్తుంటే..సుధీర్ బాబు కెరీర్ లో మ‌రో స‌క్స‌స్ ఫుల్ మూవీ అనిపిస్తుంది. మ‌రి…న‌న్ను దోచుకుందువ‌టే ఆడియ‌న్స్ ని ఎంత వర‌కు ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here