Home Reviews Movie Reviews ఈ న‌గ‌రానికి ఏమైంది..?  రివ్యూ..!

ఈ న‌గ‌రానికి ఏమైంది..?  రివ్యూ..!

21
0
Ee Nagaraniki yemaindi review

పెళ్లిచూపులు సినిమాతో చిన్న సినిమాల్లో పెద్ద విజ‌యం సాధించి సంచ‌ల‌నం సృష్టించిన యువ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్. పెళ్లి చూపులు త‌ర్వాత స్టార్ హీరోల నుంచి ఆఫ‌ర్స్ వ‌చ్చిన‌ప్ప‌టికీ..అటు వైపుకు వెళ్ల‌కుండా కొత్త వాళ్ల‌తో తెర‌కెక్కించిన‌ తాజా చిత్రం ఈ న‌గ‌రానికి ఏమైంది..?. నూత‌న న‌టీన‌టులు విష్వ‌క్సేన్ నాయుడు, సుశాంత్ రెడ్డి, అభిన‌వ్ గొమ‌టం, వెంక‌టేశ్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్‌, సిమ్ర‌న్ చౌద‌రి, గీతా భాస్క‌ర్ దాస్యం ల‌తో రూపొందించిన ఈ న‌గ‌రానికి ఏమైంది చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. ఈరోజు (జూన్ 29) ఈ న‌గ‌రానికి ఏమైంది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి…పెళ్లి చూపులు వ‌లే ఈ సినిమా కూడా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – విష్వ‌క్సేస్ నాయుడు (వివేక్‌), సుశాంత్ రెడ్డి (కార్తిక్‌), అభిన‌వ్ గొమ‌టం (కౌశిక్‌), వెంక‌టేశ్ కాకుమాను (ఉప్పు) అనే న‌లుగురు మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుల క‌థ ఇది. వీళ్లు చిన్న‌ప్ప‌టి నుంచి క‌లిసి చ‌దువుకుంటారు. కార్తీక్ ఓ ప‌బ్ లో ప‌ని చేస్తుంటాడు. ఆ ప‌బ్ ఓన‌ర్ కూతుని పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అవ్వాల‌నుకుంటాడు. కౌశిక్ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ గా వ‌ర్క్ చేస్తుంటాడు. ఎప్ప‌టికైనా యాక్ట‌ర్ అవ్వాల‌నుకుంటాడు. ఉపేంద్ర పెళ్లి క్యాసెట్స్ ఎడిటింగ్ చేస్తుంటాడు. ఇక వివేక్ డైరెక్టర్ అవ్వ‌డం కోసం షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటాడు. అయితే..ల‌వ్ ఫెయిల్ అవ్వ‌డంతో మందుకి బానిసై ఫ్రెండ్స్ కి దూరంగా ఉంటుంటాడు. అయితే..కార్తీక్ అనుకున్న‌ట్టుగానే ప‌బ్ ఓన‌ర్ కూతురితో మ్యారేజ్ ఫిక్స్ అవ్వ‌డంతో ఫ్రెండ్స్ కి పార్టీ ఇస్తాడు. ఈ పార్టీలో ఫ్రెండ్స్ అంద‌రూ క‌లుస్తారు. ఆత‌ర్వాత ఫ్రెండ్స్ గోవా వెళ‌తారు. అక్క‌డికి వెళ్లిన త‌ర్వాత ఏం చేసారు..?  వారిలో వ‌చ్చిన మార్పు ఏంటి అనేదే మిగిలిన క‌థ‌

ప్ల‌స్ పాయింట్స్

న‌టీన‌టుల యాక్టింగ్

కామెడీ

డైలాగ్స్

మైన‌స్ పాయింట్స్

అక్క‌డ‌క్క‌డా స్లోగా అనిపించ‌డం

ల‌వ్ సీన్స్

విశ్లేష‌ణ – సినిమా అన‌గానే ఓ ల‌వ్ స్టోరీ. అందులో ఓ ఐదు పాట‌లు, మూడు ఫైట్ లు, కామెడీ సీన్స్..ఇలా రోటీన్ గా వచ్చే సినిమాల‌కు పూర్తి భిన్నంగా రూపొందిన సినిమా ఇది. అనుకున్న‌ది సాధించాల‌నుకునే న‌లుగురు మ‌ధ్య త‌ర‌గ‌తి యువ‌కుల జీవితాల్లో ఏం జ‌రిగింది అనే దానిని త‌రుణ్ భాస్క‌ర్ చాలా ఇంట్ర‌స్టింగ్, చాలా నేచుర‌ల్ గా తెర పై చూపించారు. ఇంకా చెప్పాలంటే…న‌లుగురు కుర్రాళ్లు క‌లిసి మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా అలా ఉంటుంది. ఈ సినిమా చూసిన చాలా మందికి… మ‌నం మాట్లాడుకున్న‌ప్పుడు మ‌న‌కు తెలియ‌కుండా వినేసి ఈ క‌థ రాసేసుకున్నాడా అనిపిస్తుంటుంది. అంత స‌హ‌జంగా స‌న్నివేశాల‌ను, సంభాష‌ణ‌ల‌ను రాసుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాకి చేసిన‌ట్టే ఈ సినిమాకి కూడా సింక్ సౌండ్ చేసారు. టెక్నిక‌ల్ గా పెళ్లి చూపులు కంటే ఈ సినిమా బాగుంది. ఇందులో న‌టించిన లీడ్ యాక్ట‌ర్స్ పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా చాలా న‌టించారు.  ఫ‌స్టాఫ్ స్పీడుగానే న‌డిచింది కానీ..సెకండాఫ్ కి వ‌చ్చేస‌రికి కాస్త నెమ్మ‌దించింది అనిపిస్తుంది. వివేక్ సాగ‌ర్ మ్యూజిక్ బాగుంది. ఫైన‌ల్ గా ఈ మూవీ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…ఫ్రెండ్స్ తో వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయ‌చ్చు.

రేటింగ్ 3/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here