Home Telugu ఎన్టీఆర్ సెట్ లో రామోజీరావు..!

ఎన్టీఆర్ సెట్ లో రామోజీరావు..!

8
0
Ramojirao in Ntr sets

నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ ఆధారంగా ఎన్టీఆర్ బ‌యోపిక్ రూపొందుతోన్న విష‌యం తెలిసిందే. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఇటీవల ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ పాత్ర‌ను పోషిస్తోన్న బాల‌కృష్ణ పై కీల‌క  స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఎన్టీఆర్ భార్య‌గా బాలీవుడ్ భామ విద్యాబాల‌న్ న‌టిస్తున్నారు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎన్టీఆర్ సెట్ లోకి రామోజీరావు రావ‌డం విశేషం.

ఈ సంద‌ర్భంగా డైరెక్ట‌ర్ క్రిష్ ట్విట్ట‌ర్ లో స్పందిస్తూ…ఎన్టీఆర్ సెట్లో లెజండ‌రీ రామోజీరావు గారిని క‌ల‌వ‌డం జీవితంలో మ‌రచిపోలేను. రామోజీరావు గారితో అర‌గంట సేపు గ‌డిపే అవ‌కాశం రావ‌డం నా అదృష్టం. ఆయ‌న నుండి చాలా విష‌యాలు నేర్చుకున్నాను. ఆయ‌న‌కి నా ధ‌న్య‌వాదాలు అని  ఫోటోని షేర్ చేశాడు. ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 9న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా పై అటు అభిమానుల్లో, ఇటు ఇండ‌స్ట్రీలో భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి..ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌నుందో చూడాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here