Home Reviews Movie Reviews తేజ్ ఐ ల‌వ్ యు రివ్యూ..!

తేజ్ ఐ ల‌వ్ యు రివ్యూ..!

20
0
Tej i love u review

సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన లేటెస్ట్ మూవీ తేజ్ ఐ ల‌వ్ యు. ఈ చిత్రాన్ని ప్రేమ‌క‌థా చిత్రాల‌ స్పెష‌లిస్ట్ క‌రుణాక‌ర‌న్ తెర‌కెక్కించారు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్, సుప్రీమ్ ఇలా వ‌రుస‌గా విజ‌యాలు సాధించిన సాయిధ‌ర‌మ్ తేజ్..ఇటీవ‌ల కాలంలో తిక్క, విన్న‌ర్, జ‌వాన్, ఇంటిలిజెంట్…ఇలా వ‌రుస‌గా ఫ్లాప్స్ రావ‌డంతో ఈసారి ఎలాగైనా స‌రే…స‌క్స‌స్ సాధించాల‌నే ప‌ట్టుద‌ల‌తో తేజ్ ఈ సినిమా చేసాడు. టీజ‌ర్ & ట్రైల‌ర్ తో ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకున్న‌తేజ్ సినిమా ఈరోజు (జులై 6న‌) రిలీజైంది. మ‌రి…తేజ్ కి తేజ్ మూవీ విజ‌యాన్ని అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే.

క‌థ – తేజ్ (సాయిధ‌ర‌మ్ తేజ్) అమ్మ‌,నాన్న లేక‌పోయినా పెదనాన్న‌, పెద్ద‌మ్మ‌లు క‌న్న‌కొడుకులా పెంచుతారు. చిన్న‌ప్పుడు తేజ్ ఒక‌ర్ని కాపాడ‌డం కోసం ఇంకెక‌ర్ని చంపేస్తాడు. దీంతో చిన్న‌ప్పుడే జైలులో ఉంటాడు. ఆత‌ర్వాత పెద్ద‌య్యాక చెల్లెలుని త‌ను  ప్రేమించిన వ్య‌క్తికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. తేజ్ చేసిన ప‌ని న‌చ్చ‌క మ‌ళ్లీ కుటుంబానికి దూర‌మ‌వుతాడు. దీంతో బాబాయ్ (పృథ్వీ) ద‌గ్గ‌ర ఉండి చ‌దువుకుని ఆత‌ర్వాత త‌న ఫ్రెండ్స్ తో క‌లిసి మ్యూజిక్ బ్యాండ్ ని ర‌న్ చేస్తూ ఉంటాడు. ఇలాంటి టైమ్ లో తేజ్ లైఫ్ లోకి నందిని (అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్) వ‌స్తుంది. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని విధంగా ఎప్పుడూ తిట్టుకునే ఉంటారు. అలాంటిది ఓ రోజు తేజ్ చేసిన ఓ మంచి ప‌ని వ‌ల‌న నందిని తేజ్ ప్రేమిస్తుంది. కానీ..అనుకోకుండా ఓ యాక్సిడెంట్ వ‌ల‌న గ‌తం మ‌రిచిపోతుంది..?  ఈ విష‌యం తెలుసుకుని తేజ్ ఏం చేసాడు..?  ఆఖ‌రికి నందినికి గ‌తం గుర్తుకువ‌చ్చిందా..?  లేదా..?  చివ‌రికి ఏం జ‌రిగింది అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

తేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌ట‌న‌

కెమెరా వ‌ర్క్

మైన‌స్ పాయింట్స్

రోటీన్ స్టోరి

మ్యూజిక్

విశ్లేష‌ణ – క‌రుణాక‌ర‌న్ సినిమా అన‌గానే ప్రేమ‌క‌థా చిత్రాల స్పెష‌లిస్ట్ కాబ‌ట్టి ఈసారి ప్రేమ‌క‌థ‌లో ఏం చెప్ప‌బోతున్నారో..?  అనే ఇంట్ర‌స్ట్ ఉంటుంది.కానీ..క‌రుణాక‌ర‌న్ కొత్త‌గా ఏం చెప్ప‌లేదు. పాత క‌థ‌నే తీసుకున్నాడు. కథ‌నంలో కూడా కొత్త‌గా ఏం ట్రై చేయ‌లేదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు అత‌ని గ‌త చిత్రాలు తొలిప్రేమ‌, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా…త‌దిత‌ర చిత్రాలు గుర్తుకొస్తాయి. దీనికి తోడు హీరోయిన్ గ‌తం మ‌ర‌చిపోవ‌డం అనేది నాటి నుంచి నేటి వ‌ర‌కు చాలా సినిమాల్లో చూపించారు. ఈ సినిమాకి కూడా క‌రుణాక‌ర‌న్ అదే పాయింట్ ని తీసుకున్నారు. ఫ్యామిలీ ఎమోష‌న్స్, ల‌వ్ ట్రాక్, యాక్ష‌న్, కామెడీ..ఇలా అన్నింటిని ఆడియ‌న్స్ బాగా ఎంజాయ్ చేసేలా రాసుకున్న క‌రుణాక‌ర‌న్  అస‌లు పాయింట్ మాత్రం పాత‌ది తీసుకోవ‌డం సినిమాకి పెద్ద మైన‌స్. గోపీసుంద‌ర్ అందించిన పాట‌లు మ‌ళ్లీ వినాల‌నిపించేలా లేవు. సాయిధ‌ర‌మ్ తేజ్, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ వీళ్లిద్ద‌రు పాత్ర‌ల‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి పూర్తి న్యాయం చేసారు. తేజ్ ఫ్రెండ్స్ గా వైవా హ‌ర్ష అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాడు. మిగిల‌ని న‌టీన‌టులు పాత్ర ప‌రిథి మేర‌కు న‌టించారు. టోట‌ల్ గా తేజ్ మూవీ గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే…క‌రుణాక‌ర‌న్ అందించిన పాత ప్రేమ‌క‌థ‌.

రేటింగ్ 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here