Home Reviews Movie Reviews పంతం రివ్యూ..!

పంతం రివ్యూ..!

15
0
pantham movie review

గోపీచంద్ న‌టించిన తాజా చిత్రం పంతం. ఈ చిత్రానికి చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇటీవ‌ల కాలంలో గోపీచంద్ న‌టించిన సినిమాలు వ‌రస‌గా ఫ్లాప్ అవుతుండ‌డంతో పంతం సినిమా పై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. ఇందులో గోపీచంద్ స‌ర‌స‌న మోహ్రీన్ న‌టించింది. ఇది గోపీచంద్ కి 25వ సినిమా కావ‌డం విశేషం. మ‌రి..ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గోపీచంద్ కి విజ‌యాన్ని అందించిందా..?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ – హీరో గోపీచంద్ మినిష్ట‌ర్ జ‌యేంద్ర (సంప‌త్), హెల్త్ మినిష్ట‌ర్ (జ‌య‌ప్ర‌కాష్ రెడ్డి) ద‌గ్గ‌ర బ్లాక్ మ‌నీ దొంగ‌లించి…ఆ డ‌బ్బుతో పేద‌వారి క‌ష్టాలు తీరుస్తుంటాడు. అంతే కాకుండా దుర్గాదేవి అనాధాశ్ర‌మంకు నిధులు స‌మ‌కురిస్తుంటాడు. ఇలా ఉన్న‌వాళ్ల ద‌గ్గ‌ర డ‌బ్బు కొట్టేసి లేనివాళ్ల‌కు పంచే హీరో లైఫ్ లోకి అక్ష‌ర (మెహ్రీన్) వ‌స్తుంది. తొలిచూపులోనే అక్ష‌రతో ప్రేమ‌లో ప‌డిపోతాడు. కానీ…ఆమెను చూసింది ఆమె పెళ్లి నిశ్చితార్ధంలో. ఆత‌ర్వాత వీళ్ల ప్రేమ‌క‌థ ఏమైంది..?  అస‌లు…దుర్గాదేవి అనాధ‌శ్ర‌మంకు హీరోకు ఉన్న సంబంధం ఏమిటి..? ఇదంతా ఎందుకు చేస్తున్నాడు..?  త‌న డ‌బ్బులు కొట్టేసింది ఎవ‌రో తెలుసుకున్న త‌ర్వాత  జ‌యేంద్ర ఏం చేసాడు..?  అనేది మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

గోపీచంద్ న‌ట‌న‌

డైలాగులు

యాక్ష‌న్ సీన్స్

మైన‌స్ పాయింట్స్

క‌థ‌

స్ర్కీన్ ప్లే

విశ్లేష‌ణ – దేశ‌మంటే మ‌ట్టికాదోయ్..దేశ‌మంటే మ‌నుషులోయ్ అని పాట‌లోనే హీరో క్యారెక్ట‌ర్ ఏంటి అనేది చెప్పేసాడు. ఇంత‌కీ హీరో క్యారెక్ట‌ర్ ఏంటంటే…త‌న చుట్టు ఉన్న వాళ్లు బాగుండాలి అని కోరుకునే మంచి మ‌నిషి విక్రాంత్ (గోపీచంద్). విదేశాల్లో బిజినెస్ చేసే విక్రాంత్  త‌న త‌ల్లి పేరుతో ఇండియాలో న‌డుస్తోన్న అనాధ‌శ్రం 25వ వార్షికోత్స‌వంలో పాల్గొనేందుకు వ‌స్తాడు. వ‌చ్చిన త‌ర్వాత ఇక్క‌డ సామాన్యులు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నారో తెలుసుకుంటాడు. ముఖ్యంగా ప్ర‌భుత్వం నుంచి అందాల్సిన స‌హాయం అంద‌క‌పోవ‌డం….ప్ర‌భుత్వం అందించే ఆర్ధిక స‌హాయం పేద వారికి అంద‌కుండా మినిష్ట‌ర్స్, గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగులు ఎలా అడ్డుప‌డుత‌న్నారో..ఆ ఆర్ధిక‌ స‌హాయంలో కూడా వాటాలు తీసుకోవ‌డం..ఇదంతా చూసి చ‌లించిపోయిన విక్రాంత్ త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బుతో కాకుండా మినిష్ట‌ర్స్ బ్లాక్ మ‌నీని దొంగ‌లించి వాటితో పేద‌ల‌కు స‌హాయం చేస్తుంటాడు.

ఇదంతా చ‌దువుతుంటుంటే..ఇంత‌కు ముందు ఎప్పుడో చ‌దివిన క‌థ‌లా, చూసిన సినిమాలా అనిపిస్తుంటుంది ఎవ‌రికైనా. ధ‌న‌వంతుడు నుంచి డ‌బ్బు తీసుకుని పేద‌వాడికి స‌హాయం చేయ‌డం అనే కాన్సెప్ట్ తో గ‌తంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. క‌థలో ఏమాత్రం కొత్త‌ద‌నం లేదు. ఈ విష‌యాన్ని కోర్టు సీన్లో స్వ‌యంగా గోపీచంద్ ఇదేమి కొత్త క‌థ కాదు సార్..చాలా పాత క‌థ అని చెబుతాడు. ప్ర‌భుత్వం నుంచి స‌రైన స‌హాయం అంద‌క‌పోవ‌డం అనే పాయింట్ తో సినిమా తీసిన డైరెక్ట‌ర్ చ‌క్ర‌వ‌ర్తి..రాజ‌కీయ నాయ‌కులు, గ‌వ‌ర్న‌మెంట్ ఉద్యోగుల‌నే కాకుండా..డ‌బ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్నారు అంటూ సామాన్యుడుకి కూడా క్లాస్ తీసుకున్నాడు. సామాన్యుడులో మార్పు రావాల‌ని చెప్పాడు. అయితే..డైరెక్ట‌ర్ త‌న తొలి చిత్రం కాబ‌ట్టి రెగ్యుల‌ర్ స్టోరీ కాకుండా కొత్త క‌థ చెప్పేందుకు ప్ర‌య‌త్నించాల్సింది.

గోపీచంద్ త‌న పాత్ర‌కు త‌గ్గ‌ట్టు యాక్ష‌న్, ఎమోష‌న్, కామెడీ సీన్స్ లో  న‌టించి మెప్పించాడు. ఇక మెహ్రీన్ పాట‌ల‌కు ప‌రిమితం అయ్యింది. గోపీచంద్ ఫ్రెండ్ గా శ్రీనివాస‌రెడ్డి పాత్ర ప‌రిథి మేర‌కు న‌టించి ఎంట‌ర్ టైన్ చేసాడు. అలాగే ఫ‌స్టాఫ్ లో 30 ఇయ‌ర్స్ ఫృథ్వీ న‌వ్వించాడు. . ర‌మేష్ రెడ్డి, శ్రీకాంత్ రాసిన సంభాష‌ణ‌లు బాగున్నాయి. ప్ర‌సాద్ మూరెళ్ల సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. గోపీసుంద‌ర్ మ్యూజిక్ ఫ‌ర‌వాలేద‌నిపిస్తుంది. నిర్మాత రాధామోహ‌న్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. టోట‌ల్ గా పంతం గురించి ఒక్క‌మాట‌లో చెప్పాలంటే… కొత్త‌ద‌నం లేని రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ పంతం..!

రేటింగ్ 2.5/5

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here