Home Uncategorized విజేత రివ్యూ..!

విజేత రివ్యూ..!

12
0
Vijetha-Movie-Review

మెగాస్టార్ చిరంజీవి చిన్న‌ల్లుడు క‌ళ్యాణ్ దేవ్ ను హీరోగా ప‌రిచ‌యం చేస్తూ..రాకేష్ శ‌శి తెర‌కెక్కించిన సినిమా విజేత‌. ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న‌చిత్రం బ్యాన‌ర్ పై సాయి కొర్ర‌పాటి నిర్మించారు. మెగాస్టార్ అల్లుడు తొలి చిత్రం అంటే…స్టార్ డైరెక్ట‌ర్ తో ప్లాన్ చేయ‌చ్చు కానీ..తొలి చిత్రానికి ఈ క‌థే క‌రెక్ట్ అని రాకేష్ శ‌శి చెప్పిన క‌థ‌ను న‌మ్మారు. విజేత ఈ రోజు (జులై 12)న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి..రాకేష్ శ‌శి న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకున్నాడా..?  క‌ళ్యాణ్ దేవ్ తొలి ప్ర‌య‌త్నంలో విజేత‌గా నిలిచాడా.?  లేదా..?  అనేది చెప్పాలంటే ముందుగా క‌థ చెప్పాల్సిందే..!

క‌థ – మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుబుంబానికి చెందిన యువ‌కుడు రామ్ (క‌ళ్యాణ్ దేవ్). ఇంజ‌నీరింగ్ పూర్తి చేసి జాబ్ కోసం ట్రై చేస్తుంటాడు. రామ్ తండ్రి శ్రీనివాస‌రావు (ముర‌ళీశ‌ర్మ‌) స్టిల్ ఫ్యాక్ట‌రీలో వ‌ర్క్ చేస్తుంటాడు. ఆయ‌న కుటుంబం కోసం త‌న‌కు ఇష్ట‌మైన ఫోటోగ్ర‌ఫీని కూడా వ‌దిలేస్తాడు. అయితే..రామ్ మాత్రం బాధ్య‌త లేకుండా ఫ్రెండ్స్ తో స‌ర‌దాగా గ‌డిపేస్తుంటాడు. ఎదురింట్లో ఉన్న జైత్ర (మాళ‌విక నాయర్)ను  ప్రేమ‌లో ప‌డేయాల‌నుకుంటాడు. ఈ క్ర‌మంలో రామ్ చేసిన ఓ ప‌ని వ‌ల‌న తండ్రికి గుండెపోటు వ‌స్తుంది. తండ్రిని హాస్ప‌ట‌ల్ కి తీసుకెళ్లేందుకు ఎవ‌రూ రామ్ కి హెల్ప్ చేయ‌రు. ఎలోగోలా తండ్రిని కాపాడుకుంటాడు. ఇలాంటి ప‌రిస్థితుల్లో రామ్  లైఫ్ లో అనుకున్న‌ది సాధించాడా..?  త‌న కోసం ఎంతో చేసిన తండ్రి కోసం రామ్ ఏం చేసాడు..?  అనేదే మిగిలిన క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్

తండ్రికొడుకు మ‌ధ్య వ‌చ్చే ఎమోష‌న్ సీన్స్

క్లైమాక్స్

ముర‌ళీశ‌ర్మ న‌ట‌న‌

సెంథిల్ కెమెరా వ‌ర్క్

మైన‌స్ పాయింట్స్

స్లో నేరేష‌న్

విశ్లేష‌ణ – కొడుకు బాధ్య‌త లేకుండా తిర‌గ‌డం..తండ్రి కొడుకుని చూసి బాధ‌ప‌డ‌డం ఈవిధంగా తండ్రీకొడుకుల‌ కాన్సెప్ట్ తో ఇప్ప‌టి వ‌ర‌కు చాలా క‌థ‌లు వ‌చ్చాయి. అయిన‌ప్ప‌టికీ డైరెక్ట‌ర్ రాకేష్ శ‌శి ఈ క‌థ‌ను ఆడియ‌న్స్ ని ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించ‌డంలో స‌క్స‌స్ అయ్యాడ‌నే చెప్ప‌చ్చు. ఫ‌స్టాఫ్ అంతా కొడుకు బాధ్య‌త లేకుండా త‌ను ప్రేమించే అమ్మాయి చుట్టూ తిరుగుతూ..ఫ్రెండ్స్ తో స‌ర‌దాగా గ‌డిపే స‌న్నివేశాల‌తో న‌డిపించిన డైరెక్ట‌ర్ సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోష‌న్స్ తో క‌థ న‌డిపించాడు. మెగాస్టార్ అల్లుడు కాబ‌ట్టి మాస్ లో ఫాలోయింగ్ కోసం అని కాకుండా..క‌థ‌ను క‌థ‌గా చెప్పాల‌నుకోవ‌డం అభినందించ‌ద‌గ్గ విష‌యం. తండ్రి కోసం త‌ప‌న ప‌డే స‌న్నివేశాల్లో క‌ళ్యాణ్ దేవ్ కొత్త‌వాడైన‌ప్ప‌టికీ బాగా న‌టించాడు. ఈ ఒక్క స‌న్నివేశంలోనే కాదు ప్ర‌తి స‌న్నివేశంలో ఏమాత్రం త‌డ‌బ‌డ‌కుండా న‌టించాడు.

స‌త్యం రాజేష్ త‌న‌దైన శైలిలో న‌టించి న‌వ్వించాడు.  మాళ‌విక శ‌ర్మ పాత్ర‌కు త‌గ్గ‌ట్టు స‌హ‌జంగా న‌టించింది. ఈ సినిమా చూసిన వారంద‌రు చెప్పే మాట తండ్రి పాత్ర‌లో ముర‌ళీశ‌ర్మ అద్భుతంగా న‌టించార‌ని. త‌న అనుభ‌వంతో పాత్ర‌కు పూర్తి న్యాయం చేసాడు. నాజర్‌, రాజీవ్‌ కనకాల, సత్యం రాజేశ్‌, పృథ్వీ ల పాత్ర నిడివి త‌క్కువే ఉన్న‌ప్ప‌టికీ వారి టాలెంట్ చూపించారు. సెంథిల్ కెమెరా వ‌ర్క్ ఈ చిత్రానికి ప్ల‌స్ పాయింట్. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ సంగీతం బాగుంది. నిర్మాత సాయి కొర్రపాటి ఏమాత్రం రాజీప‌డ‌కుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాని నిర్మించారు. టోట‌ల్ గా ఈ సినిమా గురించి ఒక్క మాట‌లో చెప్పాలంటే..ఫ్యామిలీ అంతా క‌లిసి చూసేలా ఉన్న తండ్రీకొడుకుల క‌థ‌..!

రేటింగ్ – 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here