Home Uncategorized సుశాంత్ చి ల సౌ టీజ‌ర్ రిలీజ్ చేసిన స‌మంత‌..!

సుశాంత్ చి ల సౌ టీజ‌ర్ రిలీజ్ చేసిన స‌మంత‌..!

19
0
Sushanth movie chi la sow

అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ న‌టించిన తాజా చిత్రం చి ల సౌ. ఈ చిత్రం ద్వారా  హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇందులో సుశాంత్ స‌ర‌స‌న రుహాని శ‌ర్మ హీరోయిన్ గా న‌టించింది. విభిన్న క‌థా చిత్రంగా రూపొందిన ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన త‌క్కువ టైమ్ లో కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాని చూసిన నాగార్జున వైవిధ్య‌మైన క‌థ‌, క‌థ‌నం న‌చ్చ‌డంతో అన్న‌పూర్ణ సంస్థ ద్వారా రిలీజ్ చేస్తున్నారు.

ఇక ఈరోజు చి ల సౌ టీజ‌ర్ ను స‌మంత ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసారు. ఇక టీజ‌ర్ విష‌యానికి వ‌స్తే…రుహాని శ‌ర్మ వెర్షెన్ టీజ‌ర్ ఇది. ఈ టీజ‌ర్ చాలా కూల్ గా ఉంది. అంద‌రికీ క‌త్రినా కైఫే కావాలి కానీ…ఎవ‌రూ.. ర‌ణ‌బీర్ లా ఉండ‌రు అంటూ హీరోయిన్ రుహాని శ‌ర్మ చెప్పిన డైలాగ్ తో ఈ టీజ‌ర్ ఉంది. ఈ సినిమా చాలా బాగా వ‌చ్చింది. అందుకే రాహుల్ కి అన్న‌పూర్ణ స్టూడియోస్ ఛాన్స్ ఇచ్చింది అంటూ జ‌రుగుతోన్న ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టే ఈ టీజ‌ర్ ఉండ‌డంతో ఈ మూవీ పై మ‌రిన్ని అంచ‌నాలు పెరిగాయి. త్వ‌ర‌లోనే హీరో సుశాంత్ వెర్షెన్ టీజ‌ర్ కూడా రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 27న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here