యువ స‌మ్రాట్ అక్కినేని నాగ చైత‌న్య – ప్రేమ‌మ్ ఫేమ్ చందు మొండేటి కాంబినేష‌న్లో రూపొందుతోన్న చిత్రం స‌వ్య‌సాచి. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోన్నఈ సినిమాలో మాధ‌వ‌న్, భూమిక కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. చైతు స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్ న‌టిస్తోంది.  ఇటీవ‌లే అమెరికాలో షూటింగ్ జ‌రుపుకుంది. చైత‌న్య‌, నిధి అగ‌ర్వాల్ పై కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు. అల్ల‌రి అల్లుడు సినిమాలోని నిన్ను రోడ్డు మీద చూసిన‌ది ల‌గాయితు….అనే సాంగ్ ఎంత పాపుల‌రో అంద‌రికీ తెలిసిందే.

ఈ సాంగ్ ను ఈ మూవీ కోసం రీమిక్స్ చేయ‌నున్నారు. అల్ల‌రి అల్లుడు చిత్రానికి సంగీతం అందించిన స్వ‌ర‌వాణి కీర‌వాణియే రీమిక్స్ కి కూడా సంగీతం అందిస్తుండ‌డం విశేషం. ఒరిజిన‌ల్ సాంగ్ ను నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ  పై చిత్రీక‌రించారు. మ‌రి..రీమిక్స్ సాంగ్ లో చైతుతో పాటు ఆడిపాడే హీరోయిన్ ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. అయితే…తాజా స‌మాచారం ప్ర‌కారం.. మైత్రీ మూవీ మేక‌ర్స్ మిల్కీబ్యూటీ త‌మ‌న్నాని సంప్ర‌దించ‌డం..త‌మ‌న్నా ఓకే అన‌డం జ‌రిగిందట‌.

అల్లుడు శీను, జై ల‌వ‌కుశ చిత్రాల్లో త‌మ‌న్నా స్పెష‌ల్ సాంగ్ చేయ‌డం..ఆ సినిమాలు విజ‌యం సాధించ‌డంతో సెంటిమెంట్ ప్ర‌కారంగా కూడా త‌మ‌న్నా అయితే బాగుంటుంది అనుకున్నార‌ట‌. ఈ నెలాఖ‌రున చైత‌న్య‌, త‌మ‌న్నా పై అన్న‌పూర్ణ స్టూడియోలో ఈ రీమిక్స్ సాంగ్ చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలిసింది. ఇక ఈ మూవీని జూన్ 14న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ…కొన్ని కార‌ణాల వ‌ల‌న జులైలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here