మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా చిత్రం నేల టిక్కెట్టు. క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ ఈనెల 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సినిమా త‌ర్వాత ర‌వితేజ చేయ‌నున్న సినిమా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని. శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ర‌వితేజ స‌ర‌స‌న అను ఇమ్మాన్యుయేల్ న‌టించ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే…ఏమైందో ఏమో కానీ..అను ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకుంది.

దీంతో అను ఇమ్మాన్యుయేల్ త‌ప్పుకోవ‌డానికి కార‌ణం..ఆమె న‌టించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ అజ్ఞాత‌వాసి, అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుచేత‌నే ఆమెను అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమా నుంచి తప్పించార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రో వైపు ఆమె ఫ్యామిలీ ప్రాబ్ల‌మ్స్ లో ఉంది. అందుచేత కొత్త సినిమాలు చేసే ఆలోచ‌న‌లో లేదు. అందుక‌నే ర‌వితేజ సినిమాకి ముందు ఓకే చెప్పినా లేటెస్ట్ గా నో చెప్పింద‌ని మ‌రో వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే…అను అమ‌ర్ అక్బర్ ఆంటోని మూవీ నుంచి త‌ప్పుకోవ‌డానికి ర‌క‌ర‌కాల క‌థ‌నాలు ప్ర‌చారంలో ఉన్నాయి. అస‌లు కార‌ణం ఏమిటి అని ర‌వితేజ‌ను అడిగితే…ప్ర‌స్తుతం అను నాగ చైత‌న్య – మారుతిల శైల‌జారెడ్డి అల్లుడు సినిమాలో న‌టిస్తోంది. అందుచేత డేట్స్ కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల‌నే ఈ సినిమా నుంచి త‌ప్పుకుంది త‌ప్పా..వేరే కార‌ణం కాదంటూ క్లారిటీ ఇచ్చారు మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here