బెల్లంకొండ సాయి శ్రీనివాస్ – పూజా హేగ్డే జంట‌గా న‌టిస్తోన్న చిత్రం సాక్ష్యం. శ్రీవాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చ‌ర్స్ సంస్థ నిర్మిస్తోంది. రెగ్యుల‌ర్ చిత్రాల‌కు భిన్నంగా పంచ‌భూతాలు అనే డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోంది.ఈ విభిన్న క‌థా చిత్రంలో  ఐదు భారీ ఫైట్లు ఉంటాయని తెలుస్తుంది. అంతే కాదండోయ్… ప్రతీ ఫైట్‌ క్లైమాక్స్‌ అనిపించేంత భారీగా తెరకెక్కించారట‌. యాక్షన్‌ కొరియెగ్రాఫర్ పీటర్‌ హెయిన్స్‌ ఒక్క ఫైట్‌ను ఒక్కో థీమ్‌తో డిఫరెంట్‌గా రూపొందించారని తెలిసింది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే…ఈ సినిమాని జూన్ 14న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసారు. అయితే…కొన్ని కార‌ణాల వ‌ల‌న రిలీజ్ వాయిదాప‌డింది. సాక్ష్యం జులైలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది అని వార్త‌లు వ‌చ్చాయి. ఇప్పుడు ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని జులై 20న రిలీజ్ చేయ‌నున్న‌ట్టు అఫిషియ‌ల్ గా ఎనౌన్స్ చేసింది.  ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాలో  శరత్‌ కుమార్‌, జగపతి బాబు, మీన కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌రి..సాక్ష్యం శ్రీనివాస్ – శ్రీవాస్ ఇద్ద‌రికీ స‌క్స‌స్  అందిస్తుంద‌ని ఆశిద్దాం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here