సుధీర్ బాబు హీరోగా ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో స‌మ్మోహ‌నం అనే సినిమా రూపొందుతోంది.  అష్టా చమ్మా, జెంటిల్ మ‌న్, అమీ తుమీ…ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను తెర‌కెక్కించే ఇంద్ర‌గంటి ఈసారి కూడా వైవిధ్య‌మైన క‌ధాంశంతోనే సుధీర్ బాబుతో ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో సుధీర్ బాబు స‌ర‌స‌న అదితిరావు న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని సీనియ‌ర్ నిర్మాత శివ‌లెంక కృష్ణప్ర‌సాద్ నిర్మిస్తున్నారు.

ఇటీవల విడుదలైన స‌మ్మోహ‌నం టీజర్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. దీంతో చిత్ర యూనిట్ ట్రైలర్ ను రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేసారు. ఈ ట్రైలర్ ను  సూపర్ స్టార్ కృష్ణ గారు తన పుట్టినరోజైన మే 31వ తేదీన ఉదయం 9 గంటల 18 నిముషాలకు విడుదల చేయనున్నారు. శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం, పిజి. విందా సినిమాటోగ్రఫీ అందించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందుతోన్న ఈ స‌మ్మోహ‌నం చిత్రాన్ని జూన్ 15న రిలీజ్ చేయ‌నున్నారు. మ‌రి…స‌రైన స‌క్స‌స్ కోసం ఎదురుచూస్తోన్న సుధీర్ బాబుకి సమ్మోహ‌నం విజ‌యాన్ని అందిస్తుంద‌ని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here